: ట్యాంక్ బండ్ పై కలకలం... చెట్టుకు ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య
హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై ఓ యువకుడు చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. గుర్తు తెలియని యువకుడు చెట్టుకు వేలాడుతూ ఉండటాన్ని మార్నింగ్ వాక్ నిమిత్తం వచ్చిన కొందరు చూసి హుస్సేన్ సాగర్ లేక్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. బుధవారం రాత్రి ఇతను ఉరి వేసుకుని ఉండవచ్చని తెలుస్తోంది. ఈ యువకుడు ఎవరన్న విషయం ఇంకా తెలియరాలేదు. మృతుడి వివరాలను కనుగొనేందుకు పోలీసులు ఆరా తీస్తున్నారు.