: శశికళకు తొలగించిన భద్రత తిరిగి కొనసాగింపు... మళ్లీ 'జడ్ ప్లస్' కేటగిరీ!
జయలలిత మరణం తరువాత ఆమె నెచ్చెలి శశికళకు తొలగించిన భద్రతను తిరిగి కల్పించారు. ప్రస్తుతం అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఉన్న శశికళ త్వరలోనే ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించ వచ్చని వార్తలు వస్తున్న నేపథ్యంలోనే, ఆమె ఉంటున్న పోయెస్ గార్డెన్ కు తిరిగి భద్రతను పెంచారు. జయ మరణించిన తరువాత జడ్ ప్లస్ కేటగిరీ భద్రతను ఉపసంహరించుకుంటున్నట్టు కేంద్రం నుంచి ఆదేశాలు రావడంతో, ఒకప్పుడు 60 మందితో భద్రత ఉన్న పోయిస్ గార్డెన్ వద్ద కేవలం ఐదుగురు మాత్రమే మిగిలారు. ప్రస్తుతం పరిస్థితి మారడం, పోయెస్ గార్డెన్ కు వచ్చి పోతున్న నేతల సంఖ్య పెరగడంతో, భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ వైపు వచ్చే పాదచారులను, వాహన దారులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.