: కోల్కతాలో భారీ అగ్నిప్రమాదం.. కెమికల్ ఫ్యాక్టరీలో ఎగసిపడుతున్న మంటలు
పశ్చిమబెంగాల్లో ఈ తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని మధ్యంగ్రామ్లోని ఓ రసాయన కర్మాగారంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే 38 అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమిస్తున్నాయి. ఈ క్రమంలో మంటలు ఆర్పుతున్న ముగ్గురు అగ్నిమాపక సిబ్బందికి గాయాలయ్యాయి. బాధితులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై మరింత సమాచారం అందాల్సి ఉంది.