: ధోనీ సంచలన నిర్ణయం.. వన్డే, టీ-20 కెప్టెన్సీలకు గుడ్ బై!
టీమిండియా స్టార్ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టీమిండియా వన్డే కెప్టెన్సీకి గుడ్ బై చెప్పాడు. ధోనీ తన నిర్ణయాన్ని బీసీసీఐకు తెలిపాడు. ఈ విషయాన్ని బీసీసీఐ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది. అయితే, జట్టు నుంచి తొలగడం లేదని, వన్డే, టీ-20లకు కెప్టెన్సీ బాధ్యతల నుంచి మాత్రమే తాను తప్పుకుంటున్నానని తెలిపాడన్నారు. ఇంగ్లండ్ తో వన్డే, టీ-20 సిరీస్ కు ధోనీ అందుబాటులో ఉంటాడని పేర్కొంది. కాగా, ఇంగ్లండ్ సిరీస్ కు విరాట్ కోహ్లీ కెప్టెన్ గా వ్యవహరిస్తాడని, ఇకపై అన్ని ఫార్మాట్లకూ కెప్టెన్ గా కోహ్లీనే కెప్టెన్ గా ఉంటాడని బీసీసీఐ స్పష్టం చేసింది. కాగా, 199 వన్డేలకు, 72 టీ ట్వంటీ మ్యాచ్ లకు ధోనీ సారధ్య బాధ్యతలు వహించాడు.