: హుగ్లీలో బీజేపీ కార్యాలయానికి నిప్పు పెట్టిన ‘తృణమూల్’


రోజ్ వ్యాలీ చిట్ ఫండ్ కుంభకోణంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ అరెస్టును నిరసిస్తూ ఆ పార్టీ కార్యకర్తలు దాడులకు పాల్పడుతున్నారు. కోల్ కతాలోని బీజేపీ ప్రధాన కార్యాలయంపై దాడికి పాల్పడిన  ‘తృణమూల్’ నేతలు తాజాగా మరో సంఘటనకు పాల్పడ్డారు.  హుగ్లీలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయానికి ‘తృణమూల్’ కార్యకర్తలు ఈరోజు నిప్పుపెట్టారు. దీంతో కార్యాలయంలోని సామగ్రి ధ్వంసమైంది. 

  • Loading...

More Telugu News