: మా కుటుంబంలో కొందరు ఐసిస్ లో చేరి ఉండొచ్చు!: ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు


ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యుటర్టె మరో మారు తనదైన శైలిలో వ్యంగ్యాస్ర్తాలు సంధించారు. తన కుటుంబంలో కొందరు ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ఐసిస్ లో చేరి ఉండవచ్చని అన్నారు. ఫిలిప్పీన్స్ లో ఇటీవల జరిగిన రెండు ఉగ్రదాడుల నేపథ్యంలో రోడ్రిగో డ్యుటర్టె మాట్లాడుతూ, ఐసిస్ అన్ని చోట్లా విస్తరించిందని, ప్రాంతీయ ఐసిస్ గ్రూప్ లు అయిన మోరో ఇస్లామిక్ లిబరేషన్ ఫ్రంట్, మోరో నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ లో తన సోదరులు గతంలో సభ్యులుగా ఉండేవారని, కొందరు ఐసిస్ లోనూ పనిచేస్తున్నట్లు తెలుస్తోందని అన్నారు.

ఈ నేపథ్యంలో మీడియా స్పందిస్తూ.. ‘ఐసిస్ లో ఉన్న మీ సోదరులను ఒకవేళ మీరు కలిస్తే ఏం చేస్తారు?’ అని ప్రశ్నించగా, డ్యుటర్టె మాట్లాడకుండా మిన్నకుండిపోయారు. ఫిలిప్పీన్స్ లో ఇటీవల జరిగిన ఉగ్రదాడులకు కారణం ఇస్లామిక్ ఉగ్రవాదులేనని అన్నారు. ఈ విషయమై ఇతర దేశాధినేతలతో చర్చించినప్పటికీ, బహిరంగ ప్రకటన చేసేందుకు ఇంకా సిద్ధంగా లేమని చెప్పారు. 

  • Loading...

More Telugu News