: యూపీ ఎమ్మెల్యే బాడీగార్డ్ ఖాతాలో వంద కోట్లు!


సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) ఎమ్మెల్యే ఇర్ఫాన్ సోలంకీ బాడీగార్డు గులాం జిలానీ బ్యాంకు ఖాతాలో వంద కోట్ల రూపాయలు డిపాజిట్ అయిన సంఘటన హాట్ టాపిక్ గా మారింది. గులాం జిలానీకి తెలియకుండానే ఈ మొత్తం నగదు తన ఎస్బీఐ ఖాతాలో డిపాజిట్ కావడంతో గులాం జిలానీ ఆశ్చర్యపోయాడు.

కాన్పూర్, మాల్ రోడ్డులోని ఎస్బీఐ శాఖలో అతనికి ఖాతా ఉంది. గత రాత్రి తన ఖాతాలో డబ్బు డ్రా చేసుకునేందుకు ఏటీఎంకు వెళ్లాడు. గుర్తుతెలియని వ్యక్తులు 99 కోట్ల 99 లక్షల 2 వేల 724 రూపాయలను తన ఖాతాలో డిపాజిట్ చేసినట్లు గుర్తించాడు. ఈ సమాచారాన్ని వెంటనే ఎమ్మెల్యే సోలంకికు తెలియజేశాడు. ఈ విషయమై కాన్పూర్ జిల్లా కలెక్టర్ కుషాల్ రాజ్ శర్మకు ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు. అతని ఖాతాలో ఇంత పెద్దమొత్తాన్ని ఎవరు డిపాజిట్ చేశారన్న విషయమై దర్యాప్తు చేస్తున్నామని శర్మ తెలిపారు.

  • Loading...

More Telugu News