: నేను, రాఘవేంద్రరావు ఎలా పోటీ పడ్డామో...చిరు, బాలయ్యది కూడా అంతే!: దాసరి
తన సినీ కెరీర్ లో దర్శకుడు రాఘవేంద్ర రావుతో ఎంత ఆరోగ్యకరంగా పోటీ పడ్డానో టాలీవుడ్ అగ్రనటులు చిరంజీవి, బాలకృష్ణ మధ్య అంతే ఆరోగ్యకరమైన పోటీ ఉందని ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు అన్నారు. సినీ పరిశ్రమలో ఆరోగ్యకరమైన పోటీ ప్రతి రంగంలోను ఉంటుందని ఆయన చెప్పారు. సంక్రాంతి సీజన్ లో ఒకరి సినిమాలు మరొకరికి పోటీ కాదని ఆయన చెప్పారు. తొలి రోజు ఏ హీరో ఫ్యాన్స్ ఆ హీరో సినిమా చూస్తారని, రెండో రోజు ఇద్దరు హీరోల ఫ్యాన్స్ కలిసి ఒక సినిమా చూస్తారని ఆయన అన్నారు. సినీ పరిశ్రమలో క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్స్ సాధ్యం కావని అన్నారు. వివిధ రంగాలతో సమన్వయం చేసే క్రమంలో చెక్కులిస్తామంటే ఎవరూ పని చేయరని, ప్రధానంగా సినీ పరిశ్రమలో చెక్కులను ఎవరూ నమ్మరని ఆయన అన్నారు. డీమోనిటైజేషన్ అనాలోచిత చర్య అని, దేశాన్ని పదేళ్లు వెనక్కి తీసుకెళ్లారని ఆయన చెప్పారు.