: చిరంజీవి ఫంక్షన్ నాకు సొంత ఫంక్షన్ లాంటిది!: దాసరి నారాయణరావు


చిరంజీవి కెరీర్ లో విజయవంతమైన సినిమాలన్నింటికీ తానే ముఖ్య అతిథిగా హాజరయ్యానని ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, చిరంజీవి ఫంక్షన్ అంటే తనకు సొంత ఫంక్షన్ అని ఆయన తెలిపారు. చిరంజీవి అగ్రస్థాయి నటుడని ఆయన చెప్పారు. తనకు అవసరమైన స్టార్ డమ్ ఇప్పటికే సంపాదించేశాడని, కొత్తగా అవసరం లేదని ఆయన అన్నారు. అయితే ఆ ఆదరణ ఉందా? లేదా? అని చెప్పడానికి ఈ 150వ సినిమా పునాది అవుతుందని ఆయన తెలిపారు. చిరంజీవి తన కెరీర్ తొలినాళ్లలో ఎంత కష్టపడ్డాడో ఇప్పుడు కూడా అంతే కష్టపడ్డాడని ఆయన తెలిపారు. అతని కష్టం గురించి చాలా విన్నానని ఆయన తెలిపారు. విభేదాలు, భేదాభిప్రాయాలు ప్రతి కుటుంబంలోనూ ఉంటాయని అన్నారు.

తన 50 ఏళ్ల కెరీర్ లో హీరోలందరినీ చూస్తూ వచ్చానని, ఒకవేళ వారిని తానేదైనా అన్నా వారు సీరియస్ గా తీసుకోరని ఆయన తెలిపారు. టాలీవుడ్ లో సంక్రాంతికి 3 పెద్ద సినిమాలను భరించగల శక్తి ఉంటుందని ఆయన అన్నారు. అలాంటిది రెండు పెద్ద సినిమాలన్నది పెద్ద సమస్య కాదని.. 'ఖైదీ నెంబర్ 150', 'గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రాలు ఒకేసారి విడుదలవడంపై ఆయన వ్యాఖ్యానించారు. రెండూ వేటికవే వైవిధ్యమైన కథాంశం గల సినిమాలని ఆయన చెప్పారు. అందుకే తెలుగు సినీ ప్రేక్షకులు ఈ రెండు సినిమాలను ఆదరిస్తారని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News