: ‘ఫీజు రీయింబర్స్ మెంట్’ స్కీమును యథావిధిగా కొనసాగిస్తాం: సీఎం కేసీఆర్
ఫీజు రీయంబర్స్ మెంట్ పథకం యథావిధిగా కొనసాగుతుందని, విద్యార్థులకు ఎట్టి పరిస్థితుల్లోను ఇబ్బంది కలగనివ్వమని తెలంగాణ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అసెంబ్లీలో ఆయన ప్రసంగిస్తూ ఈ పథకానికి ఏడాదికి రూ.2,500 కోట్లు అవసరమని, విద్యార్థుల సంఖ్య మేరకు రీయింబర్స్ మెంట్ నిధులు పెంచుతామని అన్నారు. గత ఏడాది రీయింబర్స్ మెంట్ కు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోందని, ఇందు నిమిత్తం రూ.1400 కోట్లు చెల్లించామని కేసీఆర్ పేర్కొన్నారు.