: టీడీపీకి జనబలం పెరిగిపోతుందని జగన్ ఆందోళనలో ఉన్నారు!: భూమా నాగిరెడ్డి


రైతులను రెచ్చగొట్టేందుకే వైఎస్సార్సీపీ అధినేత జగన్ కర్నూలు జిల్లాకు వస్తున్నారని టీడీపీ నేత భూమా నాగిరెడ్డి విమర్శించారు. కర్నూలులో ఆయన మాట్లాడుతూ, ముచ్చుమర్రి ప్రాజెక్టు ప్రారంభంతో రాయలసీమ రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. దీంతో టీడీపీకి జనబలం పెరిగిపోతుందని జగన్ ఆందోళనలో ఉన్నారని ఆయన తెలిపారు. ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉన్న జగన్ ఈ రోజు వరకు ఒక్క మంచి ఐడియా కూడా ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. తనకు ఊహ తెలిసినప్పటినుంచి శ్రీశైలంలో 850 అడుగుల నీటిమట్టం వుండడం ఇదే ప్రథమమని ఆయన తెలిపారు. పట్టిసీమ ద్వారా గోదావరి నీళ్లు కృష్ణా ప్రాంతానికి తేవడంతోనే ఇది సాధ్యమైందని ఆయన చెప్పారు. 

  • Loading...

More Telugu News