: నారా రోహిత్ మా మీద చాలా చిరాకు పడ్డాడు!: 'అప్పట్లో ఒకడుండేవాడు' ఫేం శ్రీవిష్ణు


నారా రోహిత్ చిరాకు పడడం వల్లే 'అప్పట్లో ఒకడుండేవాడు' సినిమా రూపొందిందని ఈ సినిమాలో రైల్వే రాజుగా నటించి ఆకట్టుకున్న శ్రీ విష్ణు తెలిపాడు. 'సన్నాఫ్ సత్యమూర్తి'లో అల్లు అర్జున్ స్నేహితుడిగా నటించినా రాని గుర్తింపు ఈ సినిమాతో లభించడంతోపాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నాడు శ్రీ విష్ణు. దీనిపై అతను మాట్లాడుతూ, ఈ సినిమా మంచి విజయం సాధించడం ఆనందంగా ఉందని అన్నాడు. ఈ సినిమాకు కథను మూడు నెలల్లో రాసేశామని చెప్పాడు. అయితే దీనిని స్క్రిప్టుగా మలిచేందుకు మూడేళ్లు పట్టిందన్నాడు.

ఈ స్క్రిప్టు పట్టుకుని దర్శకుడు సాగర్ తో కలిసి ఫిల్మ్ నగర్, మణికొండలోని సినీ నిర్మాణ సంస్థల ఆఫీసుల వెంటపడ్డామని చెప్పాడు. ఎవరూ అవకాశం ఇవ్వలేదని చెప్పాడు. ఈ విషయం తెలిసిన తన స్నేహితుడు నారా రోహిత్ చిరాకుపడ్డాడని, 'ఇంక ఈ తిరుగుళ్లు ఆపండి' అని చెప్పి, సొంతంగా సినిమా నిర్మిద్దామని చెప్పాడని శ్రీ విష్ణు గుర్తుచేసుకున్నాడు. రోహిత్ కు తన జడ్జిమెంట్ పట్ల ఎంతో నమ్మకమని అన్నాడు. అంతగా నమ్మిన రోహిత్ కు మంచి విజయం రావడం ఆనందంగా ఉందని శ్రీ విష్ణు చెప్పాడు. కాగా 'అప్పట్లో ఒకడుండేవాడు' సినిమా నారా రోహిత్ సొంత బ్యానర్ పై రూపొందిన సంగతి తెలిసిందే. 

  • Loading...

More Telugu News