: కేంద్ర బడ్జెట్ పై అభ్యంతరాలు అందాయి... చర్చించి నిర్ణయం తీసుకుంటాం!: ఈసీ నజీమ్ జైదీ
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ను ప్రకటించిన వేళ, ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టాలని భావిస్తున్న 2017-18 బడ్జెట్ విషయంపై చర్చించి, త్వరలో నిర్ణయాన్ని వెలువరిస్తామని ఈసీ నజీమ్ జైదీ వెల్లడించారు. 1న బడ్జెట్ ను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్న వేళ, పలు రాష్ట్రాల ప్రతిపక్షాల నుంచి తమకు అభ్యంతరాలు అందాయని అయన తెలిపారు. అందిన ఫిర్యాదులపై పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కాగా, బడ్జెట్ ను ప్రతిపాదించేందుకు ఈసీ అంగీకరించకుంటే, బడ్జెట్ సమర్పణ మార్చి 11వ తేదీ తరువాతకు వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.