: రూ. 13 కోట్ల ముత్తూట్ దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు.. లాతూర్ లో నిందితుల అరెస్ట్
హైదరాబాదు శివారు, పటాన్ చెరువు ముత్తూట్ ఫైనాన్స్ శాఖలో భారీ ఎత్తున బంగారాన్ని దొంగిలించిన కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో నిందితులను నేడు అరెస్ట్ చేశారు. నిందితులు ముంబై పారిపోతుండగా, వారిని వెంటాడిన సైబరాబాద్ పోలీసులు లాతూర్ సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. వీరిని రేపు ఉదయం హైదరాబాద్ కు తీసుకురానున్నట్టు తెలుస్తోంది. ఏపీ 28 ఎన్ 3107 నంబరున్న వాహనంలో పారిపోతున్నారన్న సమాచారం తప్ప, మరే క్లూ లేకపోయినప్పటికీ, పోలీసులు ఈ నిందితులను పట్టుకోవడం గమనార్హం. కాగా, రామచంద్రాపురం బీరంగూడలోని ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయంలో గతవారంలో సినీ ఫక్కీలో దోపిడీ జరిపి, కేవలం 15 నిమిషాల్లోనే రూ. 13 కోట్ల విలువైన 46 కిలోల బంగారాన్ని ఐదుగురు దుండగులు దోచుకెళ్లిన సంగతి తెలిసిందే.