: ఐదు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్.. ఫలితాలు ఒకేరోజున వెల్లడి!
ఐదు రాష్ట్రాల్లోను ఎన్నికల పోలింగ్ ముగిసిన తరువాతనే ఓట్ల కౌంటింగ్ ను ఒకే రోజున చేపట్టనున్నట్టు ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. ఐదు రాష్ట్రాల్లోని అన్ని అసెంబ్లీల కౌంటింగ్ మార్చి11 శనివారం నాడు చేపడతామని, అదే రోజు ఫలితాలను విడుదల చేసి, ఎంపికైన అభ్యర్థులకు ధ్రువపత్రాలను అందిస్తామని ఎలక్షన్ కమిషన్ పేర్కొంది. ఎన్నికలు పారదర్శకంగా జరిగేందుకు ప్రతి రాజకీయ పార్టీ, పోటీ చేస్తున్న అభ్యర్థులు, మీడియా సహకరించాలని ఎలక్షన్ కమీషనర్ నజీమ్ అహ్మద్ జైనీ కోరారు. ఎన్నికలు సజావుగా సాగుతాయని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు.