tata: మరో కీలక నియామకం.. టాటా పవర్ ఛైర్మన్ గా ఎస్.పద్మనాభన్

టాటా పవర్ ఛైర్మన్ గా ఎస్.పద్మనాభన్‌ను నియమిస్తూ ఆ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఆయనకు 34 సంవత్సరాలుగా తమ సంస్థతో అనుబంధం ఉన్నట్లు తెలిపింది. తాజాగా నిర్వహించిన ఆ కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇంతవరకు పద్మనాభన్ టాటా పవర్ అడిషనల్ డైరెక్టర్ గా ఉన్నారని, ఆయనను తాజాగా ఈ కీలక పదవికి నామినేట్ చేసినట్టుగా టాటా పవర్ బీఎస్ఈ ఫైలింగ్ లో పేర్కొంది. గతనెల ఆయనను టాటాపవర్ అదనపు డైరెక్టర్‌గా కంపెనీ నియమించింది. టాటా పవర్ బోర్డ్ లో చేరే ముందు పద్మనాభం టాటా బిజినెస్ ఎక్స్లెన్స్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ గా కూడా పనిచేశారు. ఇటీవల టాటా సన్స్ గ్రూప్ హెచ్ఆర్ హెడ్‌గా అదనపు బాధ్యతలను కూడా చేపట్టారు.