: వేలల్లో ఉండే నక్సలైట్లు వందలకు చేరారు: ఏపీ డీజీపీ
గతంలో వేల సంఖ్యలో ఉండే మావోయిస్టు నక్సలైట్లు నేడు వందల సంఖ్యకు చేరారని ఏపీ డీజీపీ సాంబశివరావు తెలిపారు. గుంటూరు జిల్లా కేంద్రంలో మోడల్ పోలీస్ స్టేషన్ లను సందర్శించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఏపీలో మావోయిస్ట్ ల ప్రభావాన్ని తగ్గించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నామన్నారు. ఇంకా అక్కడక్కడ మిగిలి ఉన్న నక్సలైట్లు జనజీవన స్రవంతిలో కలవాలని ఆయన పిలుపునిచ్చారు. పోలీసులు ఆదర్శంగా పని చేయాలని సూచించిన ఆయన, అలా పని చేస్తేనే పోలీసులపై నమ్మకం పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.