: అభ్యర్థులు పెట్టాల్సిన ఎన్నికల ఖర్చు ఇంతే... గీత దాటితే తాట తీస్తాం: ఈసీ
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులు నిబంధనలకు అనుగుణంగా నడచుకోవాలని, ముఖ్యంగా ఎన్నికలకు పెడుతున్న ఖర్చు విషయంలో తేడా వస్తే ఊరుకునేది లేదని ఎన్నికల కమిషన్ హెచ్చరించింది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్ లో పోటీ పడుతున్న అభ్యర్థులు రూ. 28 లక్షలకు మించి ఖర్చు పెట్టాడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. గోవా, మణిపూర్ రాష్ట్రాల అభ్యర్థులు రూ. 20 లక్షలు మాత్రమే వెచ్చించాలని ఆదేశించింది. అంతకుమించి వెచ్చిస్తే, అనర్హత సహా అన్ని రకాల చర్యలూ తీసుకుంటామని హెచ్చరించింది. ఎన్నికల్లో ఎలాంటి డ్రగ్న్ పంపిణీ జరుగకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నామని పేర్కొంది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో నిఘా ఉంటుందని వెల్లడించింది.