: అత్యాధునిక టెక్నాలజీతో ఈ ఎన్నికలను నిర్వహిస్తున్నాం: ఈసీ


ఐదు రాష్ట్రాలకు త్వరలో జరిగే ఎన్నికలకు అత్యాధునిక సాంకేతిక టెక్నాలజీని వినియోగించనున్నట్టు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. అన్ని పోలింగ్ కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించింది. పోలింగ్ కేంద్రాలన్నీ సమీప కంట్రోలింగ్ సెంటర్ తో అనుసంధానమై ఉంటాయని, ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటన జరిగినా వెంటనే అదనపు బలగాలు అక్కడికి వెళ్లే ఏర్పాట్లు చేశామని తెలియజేసింది.

సమస్యాత్మక ప్రాంతాల్లో మరిన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, గత ఎన్నికల్లో రీపోలింగ్ జరిపిన కేంద్రాలపై, అల్లర్లు చోటు చేసుకున్న సెంటర్లపై ప్రత్యేక దృష్టిని సారించామని వెల్లడించింది. ఎలక్ట్రానిక్ బ్యాలెట్ పేపర్లపై పోటీ చేస్తున్న అభ్యర్థి పేరు, ఎన్నికల చిహ్నంతో పాటు అభ్యర్థి ఫోటో కూడా ఉంటుందని తెలిపింది. ఇది కొత్త ఫీచర్ గా ఎన్నికల కమిషన్ వెల్లడించింది. పోస్టల్ బ్యాలెట్ ను మరింత డిజిటలైజ్ చేస్తున్నామని, ఈ ఎన్నికల్లో ఓటు వేయాలని భావించే సైనికులు, ఇతర ప్రాంతాల్లో పోస్టింగ్ చేయబడ్డ అధికారులు, విదేశాల్లోని వారు సులభంగా ఓటు వేయవచ్చని తెలిపింది.

  • Loading...

More Telugu News