: అనుష్క భుజం మీద చెయ్యేసిన కోహ్లీ ఫోటో వైరల్


టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్‌ కోహ్లి.. తన ప్రియురాలు, బాలీవుడ్ నటి అనుష్క శర్మ భుజంపై చేయివేసి కబుర్లు చెప్పుకుంటూ నడుస్తున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డెహ్రాడూన్‌ విమానాశ్రయంలో తీసిన ఈ ఫొటోలో కోహ్లి-అనుష్క సన్నిహితంగా ఉండడంతో వారి అభిమానులు దీనిపై ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. గతంలో చాలా సందర్భాల్లో వీరిద్దరూ కెమెరా కంటికి చిక్కినా, ఇంత సన్నిహితంగా లేకపోవడంతో న్యూ ఇయర్ సందర్భంగా వచ్చిన పుకార్లు నిజమయ్యాయా? వీరిద్దరూ నిచ్చితార్థం చేసుకున్నారా? అన్న అనుమానం మొదలవుతోందని నెటిజన్లు పేర్కొంటున్నారు. అయితే వీరిద్దరూ క్రిస్మస్‌, నూతన సంవత్సర వేడుకలు ఉత్తరాఖండ్‌ లో నిర్వహించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తిరిగి వస్తూ డెహ్రాడూన్‌ విమానాశ్రయంలో కెమెరా కంటికి చిక్కారు. 

  • Loading...

More Telugu News