: అసెంబ్లీ లాబీలో తలసానికి రేవంత్ సూచన!
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి కేసీఆరే మొత్తం మాట్లాడుతున్నారని... కనీసం సంబంధిత మంత్రులకు కూడా మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఆరోపించారు. అసెంబ్లీ లాబీలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో పశుసంవర్ధక మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అటువైపు వచ్చారు. ఈ సందర్భంగా తలసానితో రేవంత్ మాట్లాడుతూ, "అన్నా, ఏదైనా ఉంటే ఇప్పుడే మాట్లాడుకోవే. ఆయన (కేసీఆర్) వచ్చాక మాట్లాడే అవకాశం నీకు రాదు", అని అన్నారు. దీంతో, రేవంత్ మాటలను తలసాని స్పోర్టివ్ గా తీసుకొని సభలోకి వెళ్లిపోయారు.