: ఏపీ రాజధాని మాస్టర్ డెవలపర్ కు టెండర్ నోటిఫికేషన్ జారీ!
నవ్యాంధ్ర నూతన రాజధాని మాస్టర్ డెవలపర్ ఎంపికకు టెండర్ నోటిఫికేషన్ ను జారీ చేసింది సీఆర్డీఏ. 6.84 చదరపు కిలోమీటర్ల మేర సీడ్ క్యాపిటల్ కు ఈ టెండర్ ద్వారా మాస్టర్ డెవలపర్ ను ఎంపిక చేయనుంది. టెండర్లు దాఖలు చేయడానికి ఫిబ్రవరి 21వ తేదీ వరకు గడువు ఇచ్చింది. స్విస్ ఛాలెంజ్ విధానంలోనే డెవలపర్ ను సీఆర్డీఏ ఎంపిక చేయనుంది. బిడ్డింగ్ ప్రక్రియలో రెండు దశలు ఉంటాయి. మొదటి దశలో అర్హతలను నిర్ధారిస్తుంది. రెండో దశలో అర్హులైన బిడ్డర్లు బిడ్డింగ్ లో పాల్గొనేందుకు అవకాశం ఇవ్వనుంది. కేవలం అర్హత సాధించిన సంస్థలకు మాత్రమే ఒరిజినల్ ప్రాజెక్టు వివరాలను సీఆర్డీఏ ఇవ్వనుంది.