: ఇందిరా పార్క్ వద్ద క్యాబ్ డ్రైవర్ల నిరవధిక నిరాహారదీక్ష


హైదరాబాదులోని ఇందిరా పార్క్ వద్ద తెలంగా క్యాబ్ డ్రైవర్స్ అసోసియేషన్ జేఏసీ ప్రతినిధులు ఆమరణ నిరాహారదీక్షకు దిగారు. క్యాబ్ సర్వీసుల పేరిట ఓలా, ఉబర్ క్యాబ్ సర్వీసులు శ్రమదోపిడీకి పాల్పడుతున్నాయని డ్రైవర్లు ఆరోపిస్తున్నారు. గత నెల 31 నుంచి ఈ నెల 4వ తేదీ వరకు వీరు బంద్ చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే బంద్ చేపట్టి మూడు రోజులు గడిచినా ఓలా, ఉబర్ క్యాబ్స్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో డ్రైవర్లు ఇందిరాపార్క్ వద్ద ఆమరణ నిరాహారదీక్షకు దిగారు. అంతకుముందు డ్రైవర్లు అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారిని పోలీసులు అడ్డుకోవడంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 

  • Loading...

More Telugu News