: న్యూ ఇయర్ దుస్సాహసం... భారత గగనతలంలోకి మానవ రహిత విమానాన్ని పంపిన పాక్
జనవరి 1... ప్రపంచమంతా కొత్త సంవత్సరం వేడుకలను జరుపుకుంటున్న వేళ, పాక్ తన దుర్బుద్ధిని మరోసారి చూపించింది. పాక్ భూభాగం నుంచి మానర రహిత విమానాన్ని భారత్ లోకి పంపింది. యూరీ సెక్టార్ పరిధిలోని వాస్తవాధీన రేఖ వద్ద పాక్ కు చెందిన యూఏవీ (అన్ మ్యాన్డ్ ఏరియల్ వెహికిల్) 400 మీటర్లకు పైగా చొచ్చుకు వచ్చింది. ఈ ప్రాంతంలోని అంగూర్ పోస్ట్ సైనిక అధికారులు విషయాన్ని పై అధికారులకు రిపోర్ట్ చేశారు. ఆర్మీ బేస్ క్యాంపు సమీపానికి ఈ విమానం వచ్చిందని తెలుస్తోంది.
కాగా, సరిహద్దుల్లో పరిస్థితి, పొరుగు దేశాలతో సంబంధాలపై పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. అన్ని దేశాలతో శాంతిని మాత్రమే తాము కాంక్షిస్తున్నామని, ఇతర దేశాల సంబంధాలతో పరస్పరం లబ్దిని పొందాలని చూస్తున్నామని ఈ సందర్భంగా షరీఫ్ వ్యాఖ్యానించారు. సీపీఈసీ (చైనా - పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్)తో రీజనల్ కనెక్టివిటీని పెంచడమే తమ ఉద్దేశమని తెలిపారు.