: యూపీకి ఎన్నికల షెడ్యూల్ వాయిదా... నేడు నాలుగు రాష్ట్రాలకే!


నేటి మధ్యాహ్నం భారత ఎన్నికల కమిషన్ కేవలం నాలుగు రాష్ట్రాలకు మాత్రమే ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. యూపీకి ఇంకా కేంద్ర బలగాలను పంపించని కారణంగా, ఇప్పటికిప్పుడు షెడ్యూల్ ను ప్రకటిస్తే, ఇబ్బందులు ఎదురవుతాయని భావిస్తున్న మీదటే యూపీని మినహాయించి, మిగతా రాష్ట్రాల షెడ్యూల్ ను నేడు ప్రకటించే అవకాశాలు ఉన్నాయని ఈసీ వర్గాలు వెల్లడించాయి. పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాలకు నేడు షెడ్యూల్ ప్రకటిస్తారని, ఆపై మరికొన్ని రోజుల తరువాత యూపీ షెడ్యూల్ ను విడిగా వెల్లడిస్తారని ఓ అధికారి తెలిపారు. 

  • Loading...

More Telugu News