: బీసీసీఐ అధ్యక్ష పదవికి నేను సరిపడను: సౌరవ్ గంగూలీ


బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఇన్ ఇండియా (బీసీసీఐ) తదుపరి అధ్యక్షుడిగా తనను ఎన్నుకోనున్నారని వస్తున్న వార్తలపై కోల్ కతా ప్రిన్స్ సౌరవ్ గంగూలీ స్పందించారు. తాను ఆ పదవికి సరైన వ్యక్తిని కాదని, పదవి కోసం తాను ముందు వరుసలో లేనని స్పష్టం చేశారు. క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (క్యాబ్) కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, "నా పేరు అనవసరంగా వస్తోంది. నేను సరైన వ్యక్తిని కాదు. క్యాబ్ అధ్యక్షుడిగా కేవలం ఒక్క సంవత్సరం మాత్రమే పనిచేశాను. మరో రెండేళ్లు ఇక్కడే పనిచేయాల్సి వుంది. నేనేమీ బీసీసీఐ అధ్యక్ష పదవి కోసం పరుగులు పెట్టడం లేదు" అని అన్నారు. లోథా కమిటీ సిఫార్సులపై స్పందిస్తూ, సుప్రీంకోర్టు ఆదేశాలను గౌరవించడం మినహా బీసీసీఐ ముందు మరో మార్గం లేదని అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News