: గర్భిణుల జంక్‌ఫుడ్‌తో పిల్లలపై దుష్ప్రభావాలు
గర్భిణులు జంక్‌ఫుడ్ తీసుకుంటే.. దాని ప్రభావం పుట్టబోయే పిల్లల మీద దీర్ఘకాలికంగా ఉంటుందిట. పిల్లలు కూడా అదే తరహా ఆహారానికి అలవాటు అవుతారట. గర్భిణులు, పాలిచ్చే తల్లులు ఇలాంటి తిండి తింటే.. వారి పిల్లలు అధిక కొవ్వు, ఎక్కువ చక్కెరస్థాయులు ఉండే ఆహారానికి బానిసలయ్యే ప్రమాదం ఉన్నదని అడిలైడ్ యూనివర్సిటీ వారు నిర్వహించిన తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.
తల్లులు ఆహారాన్ని ఎంచుకోవడం అనేది పిల్లల ఆహారపుటలవాట్లపై కూడా ప్రభావం కలిగి ఉంటుందిట. చివరికి వారి ఆరోగ్యంపై ప్రతికూల ఫలితాలను చూపిస్తుందని తమ అధ్యయనాలు నిరూపించినట్లు పరిశోధకులు డాక్టర్ బెవ్ పేర్కొన్నారు.