: ఫిజీలో 7.9 తీవ్రతతో భారీ భూకంపం


పసిఫిక్ మహాసముద్రంలోని దక్షిణ ప్రాంతంలో ఉన్న ఫిజీలో ఈ తెల్లవారుఝామున భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.9 తీవ్రతతో భూకంపం వచ్చినట్టు అధికారులు తెలిపారు. సుమారు 10 నుంచి 15 నిమిషాల పాటు ప్రకంపనలు నమోదయ్యాయని తెలుస్తోంది. దీని ప్రభావంతో జనజీవనం అస్తవ్యస్తం కాగా, విద్యుత్ సరఫరా నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

భూకంపంతో తొలుత సునామీ హెచ్చరికలను జారీ చేసిన అధికారులు ఆపై వాటిని ఉపసంహరించుకున్నారు. కాగా, రాజధాని సువా ప్రాంతంలో భూకంప తీవ్రత 7.2గా రికార్డు అయింది. సముద్ర తీరంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. భూకంపం తరువాత ఆస్తి, ప్రాణ నష్టంపై వివరాలు అందాల్సివుంది.

  • Loading...

More Telugu News