: డోర్నకల్‌లో విరిగిన రైలు పట్టా.. రైళ్ల రాకపోకలకు అంతరాయం
వరంగల్ జిల్లా డోర్నకల్‌లో రైలు పట్టా విరిగింది. సిబ్బంది సకాలంలో గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు వెంటనే మరమ్మతులు చేపట్టారు. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరమ్మతులు పూర్తయ్యే వరకు సమీపంలోని స్టేషన్లలో వచ్చి, పోయే రైళ్లను నిలిపివేశారు. గంటల తరబడి రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే విరిగిన పట్టాను గుర్తించకుంటే పెను ప్రమాదం జరిగేదని అధికారులు పేర్కొన్నారు.