: ఫ్లిప్‌కార్ట్ బంపరాఫర్.. రూ.10 వేలకే ఐఫోన్.. రూ.22వేల డిస్కౌంట్!
ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ భారీ ఆఫర్ ప్రకటించింది. ఆపిల్ ఐఫోన్ 6 స్పేస్ గ్రే 16 జీబీ వెర్షన్ మొబైల్‌ను రూ.9,900కే అందిస్తున్నట్టు సంచలన ప్రకటన చేసింది. ఈ ఫోన్‌పై ఏకంగా రూ.22 వేల డిస్కౌంట్‌ను ప్రకటించింది. అంతేకాదు ఈఎంఐ సదుపాయం కూడా ఉందని పేర్కొంది. యాక్సిస్ బ్యాంకు ద్వారా చెల్లింపులు చేయాలనుకునే వారికి అదనంగా మరో ఐదుశాతం వరకు డిస్కౌంట్ ఇవ్వనున్నట్టు తెలిపింది. ఈ ఆఫర్ కొత్త ఐఫోన్ 6 ఎస్ ప్లస్‌తో ఎక్స్ఛేంజ్ చేసుకునే వారికి కూడా వర్తిస్తుందని పేర్కొంది. అంతేకాదు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కచ్చితంగా అమలు చేస్తామని హామీ ఇస్తోంది. ఎక్స్ఛేంజ్ లేని వారికి అసలు ధరపై 13 శాతం(రూ.5వేలు) డిస్కౌంట్ ఇవ్వనున్నట్టు ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది.