: రిలయన్స్ జియోతో పోటీకి సై అంటున్న ఎయిర్‌టెల్.. ఎంపిక చేసిన ప్యాక్‌లపై ఏడాది పాటు ఫ్రీ ఆఫర్
రిలయన్స్ జియో సంచలనాలకు చెక్ పెట్టేందుకు భారతీ ఎయిర్‌టెల్ రంగం సిద్ధం చేసింది. ఎంపిక చేసిన ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్యాక్‌లపై ఏకంగా ఏడాదిపాటు ఫ్రీ ఆఫర్ ప్రకటించింది. దీంతో టెలికం రంగంలో మరోమారు సంచలనం నమోదైంది. 4జీ మొబైల్ ఉండి, ఎయిర్‌టెల్ వినియోగదారులు కానివారికి ప్రతినెల 3జీబీ 4జీ డేటాను అందించనున్నట్టు ఎయిర్‌టెల్ ప్రకటించింది. ఈ ఆఫర్ ఈ ఏడాది డిసెంబరు 31 వరకు అందుబాటులో ఉంటుందని తెలిపింది. వేరే నెట్‌వర్క్ నుంచి ఎయిర్‌టెల్ 4జీకి మారాలనుకుంటున్న వారి కోసం ఈ తాజా ఆఫర్‌లో బాగంగా సంవత్సరంలో రూ.9 వేల విలువైన ఉచిత డేటాను అందించనున్నట్టు తెలిపింది. నేటి (బుధవారం)నుంచే ఈ ఆఫర్ ప్రారంభమై ఫిబ్రవరి 28న ముగుస్తుందని పేర్కొంది.
ఎయిర్‌టెల్ తాజా ఆఫర్‌లో భాగంగా రూ.349 ప్రీపెయిడ్ ప్యాక్‌తో లోకల్, ఎస్టీడీ కాల్స్‌తోపాటు 4జీబీ డేటాను ఉచితంగా ఇవ్వనున్నట్టు పేర్కొంది. ఈ ప్యాక్‌లో 1జీబీ ప్యాక్ రానుండగా ఉచితంగా మరో 3 జీబీ అందిస్తున్నట్టు వివరించింది. అయితే మొదటి 3 జీబీ డేటాను మై ఎయిర్‌టెల్ యాప్ ద్వారా మాత్రమే వినియోగించుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. పోస్ట్‌పెయిడ్ వినియోగదారులకు కూడా ఈ ఆఫర్ వర్తిస్తుందని ఎయిర్‌టెల్ డైరెక్టర్ అజయ్‌పూరి పేర్కొన్నారు.