: 'అల్లరి' నరేష్ సినిమా చూస్తూ వ్యక్తి మృతి!
టాలీవుడ్ కామెడీ హీరో అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో రూపొందిన హారర్ కామెడీ సినిమా 'ఇంట్లో దెయ్యం నాకేం భయం' సినిమా చూస్తూ ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది. సిద్దిపేటలోని ఎన్టీఆర్ నగర్ కు చెందిన ఎండీ షాదుల్ (30) 'ఇంట్లో దెయ్యం నాకేం భయం' సినిమా చూసేందుకు వెళ్లాడు. ఇంటర్వెల్ సమయంలో సీట్లో ఉలుకూపలుకు లేకుండా షాదుల్ పడి ఉండడాన్ని గమనించిన పక్కసీట్లోని వారు, సమాచారం ఇవ్వడంతో థియేటర్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అతను గుండెపోటుతో మృతి చెంది ఉంటాడని అనుమానిస్తున్నారు. అతని మృతదేహాన్ని సిద్ధిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.