: నా జీవితంలో ఎన్నడూ చూడని చెత్త ఫొటో అది: సీఎన్ఎన్ కు ట్రంప్ చురకలు
తన జీవితంలో ఎన్నడూ చూడని ఒక చెత్త ఫొటోను కవర్ పేజీకి ఉపయోగించారని ప్రముఖ ఇంగ్లీషు వార్తా సంస్థ సీఎన్ఎన్ కు అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చురకలు అంటించారు. సదరు సంస్థ ‘అన్ ప్రెసిడెంటెడ్’ అనే పుస్తకం రెండో వెర్షన్ ని ఇటీవల విడుదల చేసింది. ట్రంప్ ఫొటోల కొలాజ్ ను కవర్ పేజీ ఫొటోగా వాడారు. ఈ కొలాజ్ లో.. ట్రంప్ వేదికపై ఉన్న ఒక ఫొటోతో పాటు ఇతర ఫొటోలు కూడా ఉన్నాయి. అయితే, ఏ ఫొటోను 'చెత్త ఫొటో' అంటూ ఆయన వ్యాఖ్యానించారో తెలియలేదు. కాగా, 2016 ఎన్నికలు, విజయానికి సంబంధించిన అంశాలతో ‘అన్ ప్రెసిడెంటెడ్’ సంచికను రూపొందించారు. మొదటి వెర్షన్ లో ట్రంప్ కవర్ పేజీ ఫొటో బాగుంది. కానీ, రెండో వెర్షన్ లో కవర్ పేజీ ఫొటో మాత్రం ట్రంప్ కు అసలు నచ్చకపోవడం గమనార్హం.