: ఈశాన్య రాష్ట్రాలను వణికించిన భూకంపం
ఈశాన్య రాష్ట్రాలు భూకంపంతో వణికిపోయాయి. నేటి మధ్యాహ్నం త్రిపురలోని అబస్సా కేంద్రంగా ఈ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.7గా నమోదైంది. ఒక్కసారిగా కాళ్ల కింద భూమి కంపించడంతో స్థానికులు ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. కాగా, భూకంపం కారణంగా సంభవించిన నష్టంపై వివరాలు తెలియాల్సి ఉంది.