: పశ్చిమ బెంగాల్ లో ఉద్రిక్తత...బీజేపీ కార్యాలయంపై రాళ్లదాడి


పశ్చిమబెంగాల్ లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి మమతాబెనర్జీకి షాక్ ఇస్తూ టీఎంసీ ఎంపీ సుదీప్ బంధోపాధ్యాయను సీబీఐ అధికారులు అరెస్టు చేయడం కలకలం రేపింది. ఆయనతో పాటు మరో ఎంపీ తపస్ పాల్, ఆయన కుమార్తెను కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రోజ్ వాలీ చిట్ ఫండ్ కుంభకోణంలో వీరు భాగమయ్యారని ఆరోపిస్తూ, విచారించాలంటూ అదుపులోకి తీసుకోవడాన్ని టీఎంసీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోయారు. దీంతో కోల్ కతాలోని బీజేపీ కార్యాలయంపై దాడికి దిగారు. పోలీసులు రంగప్రవేశం చేసి టీఎంసీ కార్యకర్తలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో రెచ్చిపోయిన టీఎంసీ కార్యకర్తలు రాళ్లదాడికి తెగబడ్డారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. 

  • Loading...

More Telugu News