: ములాయంతో ముగిసిన భేటీ... తన షరతులు అంగీకరించాలని కోరిన అఖిలేష్


సమాజ్ వాదీ పార్టీ నేత, తన తండ్రి  ములాయం సింగ్ యాదవ్ తో సీఎం అఖిలేష్ భేటీ ముగిసింది. లక్నోలో మూడు గంటల పాటు సాగిన ఈ భేటీలో అఖిలేష్ తన తండ్రి ముందు  కొన్ని షరతులు పెట్టినట్లు తెలుస్తోంది. ఎస్పీ జాతీయ అధ్యక్షుడిగా ములాయం ఉండేందుకు అఖిలేష్ అంగీకరించారని,  శివపాల్ యాదవ్ ను ఢిల్లీకే పరిమితం చేయాలని, అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థులను తానే నిర్ణయిస్తానని అఖిలేష్ చెప్పారని సమాచారం. ఈ షరతులకు అంగీకరిస్తేనే ఎన్నికల కమిషన్ కు ఇచ్చిన ఫిర్యాదు వెనక్కి తీసుకుంటానని తన తండ్రితో అఖిలేష్ చెప్పినట్లు పార్టీ వర్గాల సమాచారం.

  • Loading...

More Telugu News