: డీమోనిటైజేషన్ తో జయాబచ్చన్, ఐశ్వర్యారాయ్ బచ్చన్ కూడా ఇబ్బంది పడుతున్నారు: సోషల్ మీడియాలో జోకులు
గత నవంబర్ 8న ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన డీమోనిటైజేషన్ (పెద్ద నోట్ల రద్దు)తో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులెదుర్కొంటున్నారంటూ సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. డీమోనిటైజేషన్ సెగ బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ కుటుంబాన్ని కూడా తాకిందని నెటిజన్లు పేర్కొంటున్నారు. దీనికి సాక్ష్యంగా అమితాబ్ భార్య జయాబచ్చన్, కోడలు ఐశ్వర్యారాయ్ బచ్చన్ వివిధ సందర్భాల్లో ధరించిన సేమ్ డిజైన్ చీరలను చూపిస్తూ...'నోట్లు లేక అత్తా కోడళ్లు ఒకే చీరను ధరిస్తున్నా'రంటూ నెటిజన్లు తమ హాస్యచతురతను ప్రదర్శిస్తున్నారు.