: 2017 జనవరి 1న విమానంలో బయల్దేరి 2016లోకి వెళ్లారు!


'కాలం ఎవరికోసం ఆగదు, ముందుకు సాగిపోతుంది' అంటూ పర్సనాలిటీ డెవలెప్ మెంట్ తరగతుల్లో చెబుతుంటారు. కానీ 2017లో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకుని, తిరిగి 2016లోకి కొంత మంది వెళ్లిన ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... ప్రపంచంలోని వివిధ దేశాల కాలమానంలో తేడాలున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చైనాలో 2017 నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకుని, కుటుంబసభ్యులు, స్నేహితులకు శుభాకాంక్షలు చెప్పిన కొంత మంది యునైటెడ్ ఎయిర్ లైన్స్ విమానంలో 2016 డిసెంబర్ 31న శాన్ ఫ్రాన్సిస్కో చేరుకున్నారు.

వివరాల్లోకి వెళ్తే... యునైటెడ్ ఎయిర్ లైన్స్ కు చెందిన యూఏ890 (బోయింగ్ 787-909) విమానం 2017 జనవరి 1వ తేదీన వేకువజామున చైనాలోని షాంఘైలో బయలుదేరింది. ఆ బోయింగ్ విమానం అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోకు 2016 డిసెంబర్ 31న రాత్రి (అక్కడి కాలమానం ప్రకారం) చేరుకుంది. ఇది ఎలా సాధ్యమంటే.. ఈ రెండు పట్టణాల మధ్య టైమ్ వ్యత్యాసం సుమారు 16 గంటలు. కాగా, షాంఘై నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకు చేరుకునేందుకు సుమారు 11 గంటల 5 నిమిషాల సమయం పడుతుంది. చైనాలో ముందుగా తెల్లవారితే అమెరికాలో ఆలస్యంగా తెల్లవారుతుంది. దీంతో షాంఘైలో 2017 ప్రవేశించాక బయల్దేరిన వారు అమెరికాలో సాయంత్రం 8 గంటలకు 2016లోకి అడుగుపెట్టారు. దీంతో వారి ప్రయాణానికి సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేయగా, అది వైరల్ గా మారింది.  

  • Loading...

More Telugu News