: రికార్డ్ బ్రేక్ చేసిన క్రికెట్ అంపైర్ అలీమ్ దార్


అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత అనుభవజ్ఞుడైన అంపైర్ గా పాకిస్థాన్ కు చెందిన అలీమ్ దార్ రికార్డు సృష్టించాడు. కేప్ టౌన్ లో సౌతాఫ్రికా, శ్రీలంకల మధ్య జరుగుతున్న రెండో టెస్టు సందర్భంగా ఆయన రూడీ కోర్ట్ జెన్ (దక్షిణాఫ్రికా) రికార్డును అధిగమించాడు. ఈ మ్యాచ్ తో అలీమ్ దార్ 332 అంతర్జాతీయ మ్యాచ్ లకు అంపైరింగ్ చేశాడు. ఇందులో 109 టెస్టులు, 182 వన్డేలు, 41 టీ20లు ఉన్నాయి. రూడీ 331 అంతర్జాతీయ మ్యాచ్ లకు అంపైరింగ్ చేశాడు. 2002లో ఐసీసీ అంపైర్ల ప్యానల్ లో అలీమ్ దార్ భాగస్వామి అయ్యాడు. 2009, 2010, 2011లలో వరుసగా ఐసీసీ అంపైర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును సొంతం చేసుకున్నాడు. 

  • Loading...

More Telugu News