: ముడుపుల వ్యవహారంపై తమ దేశ ప్రధానినే ప్రశ్నించిన ఇజ్రాయెల్ పోలీసులు


కొందరు వ్యాపారవేత్తల నుంచి ముడుపులు తీసుకున్నారనే ఆరోపణలపై ఇజ్రాయెల్  దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును ఆ దేశ పోలీసులు ప్రశ్నించారు. ఈ విషయాన్ని ఆ దేశ న్యాయమంత్రిత్వ శాఖ ఒక ప్రకటన ద్వారా తెలిపింది. అంతకుముందు, జెరూసలెంలోని నెతన్యాహు ఇంట్లో మూడు గంటలపాటు విచారణాధికారులు ఆయన్ని విచారించారు. కాగా, నెతన్యాహును పోలీసులు విచారించడంపై ప్రత్యర్థులు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దీనిపై స్పందించిన నెతన్యాహు.. ‘ప్రత్యర్థులు సంబరాలు చేసుకుంటున్నారు. వారి ఆనందం ఎక్కువ సేపు నిలవదు. మనమే ఇజ్రాయెల్ ను పాలిస్తాం’ అని ఆయన పేర్కొన్నారు.


  • Loading...

More Telugu News