: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మోదీ, చంద్రబాబు


భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. ఆయనతో పాటు గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా వీరికి టీటీడీ ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో సాంబశివరావు, వేదపండితులు స్వాగతం పలికారు. దర్శనానంతరం ప్రధానికి ఆలయ అర్చకులు ఆశీర్వచనం పలికి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుపతిలోని ఎస్వీ యూనివర్శిటీలో 104వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సదస్సుకు మోదీ హాజరయ్యారు. అనంతరం స్వామివారి దర్శనం కోసం తిరుమల వెళ్లారు.

  • Loading...

More Telugu News