: మన కోడి గుడ్లు, కోడిపిల్లలపై నిషేధం విధించిన సౌదీ!
బర్డ్ ఫ్లూ వ్యాధి ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో సౌదీ అరేబియా కీలక నిర్ణయం తీసుకుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెచ్చరికల నేపథ్యంలో, పౌల్ట్రీ ఉత్పత్తుల దిగుమతులను సౌదీ అరేబియా నిషేధించింది. ఈ క్రమంలో భారత్ నుంచి దిగుమతి అయ్యే కోడి పిల్లలు, గుడ్ల దిగుమతిపై తాత్కాలికంగా నిషేధం విధించింది. సౌదీ నిర్ణయంతో భారత పౌల్ట్రీ పరిశ్రమ షాక్ కు గురయింది. భారత్ నుంచి సౌదీకి భారీ ఎత్తున పౌల్ట్రీ ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. అయితే, మన దేశంలో తక్కువ వ్యాధికారక ఇన్ఫ్లుయెంజా మాత్రమే ఉందని... కొన్ని సందర్భాల్లో మాత్రమే ఇది ఉద్ధృతమవుతుందని గోద్రెజ్ ఆగ్రోవెట్ మేనేజింగ్ డైరెక్టర్ బలరామ్ యాదవ్ తెలిపారు.