: విజయవాడలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం... పరుగులు తీసిన పేషెంట్లు, బంధువులు
విజయవాడలోని సెంటినీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగింది. దీంతో, ఆసుపత్రిలో ఉన్న పేషెంట్లు, వారి బంధువులు పరుగులు తీశారు. ప్రమాద సమయంలో ఆసుపత్రిలో 200 మంది పేషెంట్లు ఉన్నారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అదృష్టవశాత్తు ఎవరికీ ఏమీ జరగలేదు. ఆసుపత్రిలోని పేషెంట్లను దగ్గర్లోని మరో ఆసుపత్రికి తరలిస్తున్నారు.