: చిరంజీవి 'ఖైదీ' ఫంక్షన్ కు పవన్ కల్యాణ్ రావడం లేదు.. ధ్రువీకరించిన అల్లు అరవింద్!
ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మితమైన చిరంజీవి 150వ చిత్రం 'ఖైదీ నంబర్ 150' ప్రీరిలీజ్ ఫంక్షన్ గుంటూరులోని హాయ్ ల్యాండ్ లో జరగనుంది. ఈ ఫంక్షన్ కు మెగా హీరోలంతా తరలిరానున్నారు. అయితే జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈ కార్యక్రమానికి హాజరవుతారా? లేదా? అనే సందేహం మెగా అభిమానుల మెదడును తొలచివేస్తోంది. ఈ నేపథ్యంలో, ఈ విషయంపై ప్రముఖ నిర్మాత, చిరంజీవి బావమరిది అల్లు అరవింద్ క్లారిటీ ఇచ్చారు. 'ఖైదీ' వేడుకకు పవన్ కల్యాణ్ హాజరు కావడం లేదని ఆయన స్పష్టం చేశారు. బిజీ షెడ్యూల్ కారణంగానే పవన్ రావడం లేదని చెప్పారు.