: బీఎస్పీ అభ్యర్థుల ఎంపిక పూర్తి: మాయావతి
బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తయినట్లు ఆ పార్టీ అధినేత మాయావతి వెల్లడించారు. యూపీలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 403 స్థానాలకు అభ్యర్థులను ఫైనలైజ్ చేశామన్నారు. అందులో ఎస్సీ-87, మైనార్టీ-97, ఓబీసీ-106, ఓసీ -113 స్థానాలను కేటాయించినట్లు చెప్పిన మాయావతి, ఒంటరిగానే ఎన్నికలబరిలోకి దిగుతున్నామని స్పష్టం చేశారు. సమాజ్ వాదీ పార్టీకి ఓటేస్తే బీజేపీకి లాభమని, మతతత్వ పార్టీకి లాభం చేకూర్చే పనిని ఓటర్లు చేయవద్దని ఈ సందర్భంగా ఆమె విజ్ఞప్తి చేశారు.