: ‘డబుల్ బెడ్ రూమ్’ లు సూపర్ .. కేసీఆర్ ను ప్రశంసించిన కేంద్ర మంత్రి గోయల్
డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు చక్కగా ఉన్నాయని, ఈ పథకం దేశానికే ఆదర్శంగా ఉందని కేంద్రమంత్రి విజయ్ గోయల్ ప్రశంసించారు. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలో ఈరోజు ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రికి ఘనస్వాగతం పలికారు. మర్కుర్ మండలం ఎర్రవల్లి గ్రామంలోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఆయన పరిశీలించారు. అనంతరం గోయల్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారని, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు చక్కగా ఉన్నాయని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న డబుల్ బెడ్ రూమ్ పథకం అందరికీ ఆదర్శంగా ఉందనీ, ఈ విషయమై ప్రధాని మోదీతో చర్చించి దేశ వ్యాప్తంగా అమలయ్యేలా చూస్తామని అన్నారు.