: టెక్నాలజీ వినియోగంపైనే భవిష్యత్ ఆధారపడి ఉంటుంది: సీఎం చంద్రబాబు
టెక్నాలజీ వినియోగంపైనే భవిష్యత్ ఆధారపడి ఉంటుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. తిరుపతి వేదికగా జరుగుతున్న జాతీయ సైన్స్ కాంగ్రెస్ సదస్సులో ఆయన పాల్గొన్ని ప్రసంగించారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో దేశం దూసుకుపోతోందని, ఆర్థిక సంస్కరణల్లో భాగంగా పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ వంటి రెండు అతిపెద్ద నిర్ణయాలను తీసుకున్నారన్నారు. భారత్ మానవ వనరుల కేంద్రంగా మారిందని, ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా భారతీయులే ఉంటున్నారని అన్నారు. ఏపీలో బయోమెట్రిక్ పద్ధతిలో చౌకదుకాణాల నుంచి సరుకులు అందిస్తున్నామని, మొబైల్స్ ద్వారా ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తున్నామని పేర్కొన్న చంద్రబాబు, నెలకు రూ.149 లకు ఫైబర్ గ్రిడ్ సేవలు అందిస్తున్నామని అన్నారు.