: నటుడు అర్జున్ కపూర్ అక్రమ నిర్మాణం కూల్చివేత
బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ తన ఇంటి టెర్రస్ పై ఏర్పాటు చేసుకున్న ‘జిమ్’ని బృహాన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) కూల్చివేసింది. అర్జున్ కపూర్ ఇల్లు జుహూ ప్రాంతంలో ఉంది. బీఎంసీ అనుమతి తీసుకోకుండా ఈ నిర్మాణం చేపట్టడంతో గతంలో నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఈ అక్రమ నిర్మాణాన్ని నిన్న కూల్చివేశారు.