: కిడ్నీ వ్యాధి బాధ నాకు తెలుసు... ఆ వ్యాధితో మా బాబాయ్ చనిపోయారు కూడా!: పవన్ భావోద్వేగం


'చంద్రబాబు ప్రభుత్వం, ఆరోగ్య శాఖా మంత్రి చెబుతున్నట్టు కేవలం డయాలసిస్ సెంటర్లు పెట్టించి చేతులు దులుపుకుంటే చూస్తూ ఊరుకునేది లేదు. నాకు కిడ్నీ బాధితులు ఎలా ఉంటారో తెలుసు. స్వయంగా అనుభవించాను కూడా. మా బాబాయ్ చనిపోయారు కిడ్నీ వ్యాధితో. ఆ బాధ నాకు తెలుసు' అని భావోద్వేగంతో చెప్పారు.

డయాలసిస్ అనేది కిడ్నీ వ్యాధిలో చిట్టచివర చేసే పనిగా పేర్కొన్న ఆయన, ప్రాణాలు పోయేవేళ, దాన్ని పొడిగించేందుకు వాడాలే తప్ప, అదేదో చికిత్స అన్నట్టు, వ్యాధి నుంచి బయటపడేస్తుందన్నట్టు మాట్లాడుతూ ఉండటం దురదృష్టకరమని చంద్రబాబు ప్రభుత్వాన్ని విమర్శించారు. చాలా ఘోరమైన విపత్తు పీడిస్తున్న వేళ, చంద్రబాబు ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నానని, ఉద్దానం బాధితుల సమస్య పరిష్కారానికి కృషి చేయాలని, లేకుంటే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఓ కమిటీ వేసి, ప్రజల స్థితిగతులను పరిశీలించాలని రూ. 100 కోట్ల నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News