: కర్ణాటక మంత్రి మహాదేవ్ ప్రసాద్ హఠాన్మరణం
కర్ణాటక రాష్ట్ర కార్పొరేష్ శాఖ మంత్రి హెచ్ఎస్ మహాదేవ్ ప్రసాద్(58)హఠాన్మరణం చెందారు. ఈరోజు ఉదయం ఆయనకు గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. చిక్ మగళూరులోని కొప్పాలో ఒక కార్యక్రమంలో పాల్గొనే నిమిత్తం అక్కడికి వెళ్లారు. అయితే, అక్కడి ఒక ప్రైవేటు రిసార్ట్ లో ఉన్న సమయంలో ఆయనకు గుండెపోటు వచ్చినట్లు సంబంధిత వర్గాల సమాచారం. కాగా, ప్రస్తుతం చామరాజ్ నగర్ జిల్లాలోని గుండ్లుపేట్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఆయన వ్యవహరిస్తున్నారు. ఇప్పటివరకు ఆయన ఐదుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఆయన విశ్వాసపాత్రుడనే పేరుంది. 2013లో ఆయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.